PS Telugu News
Epaper

గొడుగుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతదేహం గుర్తింపు

📅 11 Nov 2025 ⏱️ 5:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు”

(పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్)

ఈరోజు దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతదేహం కనుక్కోవడం స్థానికులు ఆందోళన రేపింది సంఘటన స్థలానికి చేరుకొని అటవీ వెటర్నరీ అధికారులు పంచనామా పులి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సహజ మరణం అనుమానం చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచన సోమవారం గ్రామస్తులు అడవిలో చిరుతను గుర్తించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు మరియు స్థానిక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫోటోలు తీస్తున్న సమయంలో పులి కదలికలు లేకపోవడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం సిద్దిపేట జిల్లా వెటర్నరీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పులి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం ఆశ్చర్యమన్నారు. వెటర్నరీ అధికారులు ప్రాథమికంగా ఇది సహజ మరణం కావచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ. మన సిద్దిపేట జిల్లాలో అటవీ జంతువులకు సంబంధించిన కేసులు గతంలో 40 వరకు ఉండగా వాటిని ప్రస్తుతం 28 వరకు తగ్గించామని అన్నారు. అయితే చిరుతపులలో సంచారం ఉండే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రి వేళలో లేదా పొలాల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే ఎవరైనా అటవీ జంతువులను గమనించినప్పుడు తక్షణమే పోలీసు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పులి మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు సి సి ఎం బి రిపోర్ట్ వచ్చిన తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వెటర్నరీ హాస్పిటల్స్ అధికారులు అటవీశాఖ సిబ్బంది పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top