భీంగల్ మండలం మెండోరా గ్రామంలోని చౌక ధరల దుకాణం వద్ద నిత్యవసర వస్తువుల ఇందిరమ్మ చేతి సంచులు పంపిణీ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలం
ఈరోజు బుధవారం రోజున మెండోరా గ్రామంలోని, చౌకధరల దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల ఇందిరమ్మ చేతి సంచులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శేఖర్ పల్లికొండ నరేందర్, సత్యం, సాకలి గంగాధర్ మంగలి శ్రీనివాస్ పుర్రె రాజేందర్ గంగం భాస్కర్ గౌరీ ప్రశాంత్,బెజ్జంకి రాజేందర్, రవి లంబాడి ఆనంద్ నయీమ్, వడ్డే రమేష్, గుండ్ల అంజి, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ వల్ల ఈరోజు బుధవారం రోజున భూమి లేని పేదవాళ్ల మైన మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల సంతోషంగా సన్న బియ్యంతో అన్నం వండుకొని తింటున్నామని కుటుంబ సభ్యులందరం కూడా ఆనందంగా ఉన్నామని, ఇలాంటి ముఖ్యమంత్రి పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఇంకా ఎంతో పేద ప్రజలకు సేవ చేయాలని రేవంత్ రెడ్డి కి మేమంతా అండగా నిలబడతామని తెలిపారు. మాకందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇప్పిచ్చిన బాల్కొండ నిజ వర్గ ఇన్చార్జి సునీల్ అన్నకి, దగ్గరుండి మాకందరికీ కూడా సన్న బియ్యం కార్డులు ఇప్పించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు…