PS Telugu News
Epaper

జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తే సహించం

📅 12 Nov 2025 ⏱️ 6:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు లక్కాకుల రమేష్ కుమార్ కు సన్మానం..

( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీనియర్ జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి లక్కాకుల రమేష్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం శంకర్పల్లి వద్ద జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పదవిని ప్రకటించిన అనంతరం ఆయనకు సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం సమాజ సేవలో నిమగ్నమై ఉంటారని, ఈ క్రమంలో వారిపై దాడులు, దౌర్జన్యాలు సర్వ సాధారణంగా మారాయని అన్నారు. ఇకపై భవిష్యత్తులో వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. రమేష్ కుమార్ లాంటి సీనియర్ జర్నలిస్టులు వర్తమాన జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచి సమాజంపై ఎలా పోరాడాలో నేర్పించాలని ఈ సందర్భంగా సంఘాల నాయకులు స్పష్టం చేశారు..

Scroll to Top