పట్టించుకోని మైనింగ్ శాఖ.గద్వాల జిల్లలో ఇసుక మాఫియా.
పయనించే సూర్యుడు తేదీ 13 నవంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న.
పట్టించుకోని మైనింగ్ శాఖ.గద్వాల జిల్లా: అక్రమార్కులు యథేచ్ఛగా జిల్లా: అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తూ ముఖ్యంగా ర్యాలంపాడు రిజర్వాయర్, కింద ఉన్న చెరువులను ఇష్టానుసారం గుల్ల చేస్తూ ట్రాక్టర్లలో విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కింద ఉన్న ఆలూరు పాత గ్రామంలో నిత్యం రాత్రి సమయంలో దళారులు పెద్ద ఎత్తున ఇసుక దందా నిర్వహిస్తున్నారు. కూలీలను పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారు. రిజర్వాయర్ లోని ముంపుకు గురైన భూమిలో తవ్వకాలు జరుపుతూ ఇసుక డంప్ లను ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. అధిక ధరలకు ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతలా దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

