‘అఖండ 2’ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ – మ్యూజిక్ లాంచ్‌పై భారీ ప్రణాళికలు
పయనించే సూర్యుడు న్యూస్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఒకట్రెండు వీడియో గ్లింప్స్, టైటిల్ సాంగ్ ప్రోమో మాత్రమే రిలీజ్ అయ్యాయి. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను ఎప్పుడు మొదలు పెడతారా? అనే చర్చ మొదలైంది. అయితే అందరి అనుమానాలకు చెక్ పెడుతూ మేకర్స్.. నవంబర్ 14న తొలి పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే దీని కోసం భారీ ప్లాన్ చేశారు. అందులో భాగంగా ముంబై జుహూలోని పివిఆర్‌లో పాటను విడుదల చేయబోతున్నారు. సాంగ్ రిలీజ్‌కే ఇలా ప్లాన్ చేశారంటే టీజర్, ట్రైలర్ కోసం ఇంకెలాంటి ప్లానింగ్ వేస్తారోనని అందరూ అనుకుంటున్నారు.