PS Telugu News
Epaper

రేపు బీహార్ అసెంబ్లీ ఫలితాలు! గెలుపుపై దేశం ఉత్కంఠలో

📅 13 Nov 2025 ⏱️ 4:05 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికల సందడి నెలకొంది.  నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. అయితే నవంబర్ 14 ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.  మొత్తం 243  అసెంబ్లీ స్థానాల్లో 122 మెజారిటీ మార్కు స్థానాలు సాధించే అధికారం చేపట్టే అవకాశం ఉంది.  మొత్తం రెండు దశల్లో పోలింగ్ జరరగా.. సుమారు 66.91 శాతం ఓటు వేశారు. ఇది గత చరిత్రలో అత్యధికం కావడం విశేషం. ఈ ఎన్నికలలో ప్రధానంగా రెండు కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ, ఇతర చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అలాగే మహాకూటమిలో రాష్ట్రీయ జనతాదళ్  నాయకుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్ , వామపక్ష పార్టీలతో సహా ఇతర విపక్షాల కూటమిగా వీటితో పాటు  ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’ పార్టీ కూడా కొన్ని స్థానాల్లో ప్రభావం చూపనుంది.2. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉన్నాయి.  నవంబర్ 14 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 9 గంటల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల లెక్కింపు ప్రారంభమయ్యాక, తొలి ట్రెండ్‌లు వెలువడటం మొదలవుతాయి.ఇక, మధ్యాహ్నం తర్వాత, లెక్కింపు ఆధారంగా స్పష్టమైన ఫలితాలు వెలువడతాయి. తుది సీట్ల లెక్క,గెలుపు ప్రకటన సాయంత్రం లేదా రాత్రికి పూర్తవుతుంది. ఈ ఎన్నికల్లో సుమారు 66.91 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ ఎన్నికల చరిత్రలో అత్యధికం కావడం గమనార్హం. అధిక ఓటింగ్ శాతం మార్పునకు సంకేతమా లేక పాలకపక్షానికి అనుకూలమా అనేది రేపు తేలనుంది.  అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుత పాలక కూటమి ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తుండగా.. కొన్ని సర్వేలు మాత్రం ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాకూటమికి గట్టి పోటీ ఉంటుందన్సూనారు. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్,  సీనియర్ మంత్రులు, ప్రముఖ అభ్యర్థుల రాజకీయ భవితవ్యం రేపు తేలనుంది.


Scroll to Top