PS Telugu News
Epaper

హీరో ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి:కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో

📅 13 Nov 2025 ⏱️ 4:26 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ లెజెండ్రీ యాక్ట‌ర్ ధ‌ర్మేంద్ర ఆరోగ్య ప‌రిస్థితి చ‌క్క‌బ‌డిన‌ట్లు లేదు. ఇటీవ‌ల ఆయ‌న‌కు తీవ్ర అస్వ‌స్థ‌త క‌ల‌గ‌టంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు కూడా నేష‌న‌ల్ మీడియా స‌హా అన్నీ చోట్ల రావ‌టంతో కుటుంబ సభ్యులు ఫైర్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. బుధ‌వారం ఉద‌యం ఏడున్న‌ర గంటల ప్రాంతంలో ఆయ‌న్ని హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు డాక్ట‌ర్స్ ఆయ‌న‌కు ఇంటి ద‌గ్గ‌ర్నుంచే ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ధ‌ర్మేంద్ర‌కు ఇంటి వ‌ద్ద‌నే ట్రీట్‌మెంట్ జ‌రుగుతుంది. ఆయ‌న్ని చూసి కుటుంబ స‌భ్యులు ఎమోష‌న‌ల్ అవుతున్నారు. కుమారులు స‌న్నీడియోల్, బాబీ డియోల్ స‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యులు ధ‌ర్మేంద్ర ప‌డుకుని ఉన్న బెడ్ ద‌గ్గ‌ర నిలుచుని ఎమోష‌న‌ల్ అవుతున్న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. హాస్పిట‌ల్ నుంచి ధ‌ర్మేంద్ర డిశ్చార్జ్ అయ్యారు కానీ.. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విషమంగానే ఉంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో హాస్పిట‌ల్ నుంచి ఎందుకు డిశ్చార్జ్ చేశార‌నే దానిపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.వ‌య‌సు రీత్యా వ‌చ్చిన ఆరోగ్య ప‌ర‌మైన శ్వాస కోసం సమ‌స్య‌ల‌తో ధ‌ర్మేంద్ర ఇటీవల హాస్పిట‌ల్‌లో చేరారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నెటిజ‌న్స్ ప్రార్థిస్తున్నారు. మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన ధ‌ర్మేంద్ర బాలీవుడ్ హీ మ్యాన్ అనే ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఈయ‌న కుమారులు స‌న్నీ డియోల్‌, బాబీ డియోల్, కుమార్తె ఈషా డియోల్ అంద‌రూ సినీ రంగంలో త‌మదైన గుర్తింపును సంపాదించుకున్నవారే.

Scroll to Top