PS Telugu News
Epaper

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సామాన్యులకు అందని గృహ నిర్మాణా మున్సిపల్ అప్రూవల్‌

📅 14 Nov 2025 ⏱️ 1:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 14(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ వినాయకుడు గుడి దగ్గర నెర్రి కాలువను ఆనుకొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది ఈ భవనము బఫర్ జోన్ కు ఒక్క అడుగు దూరంలో‌ ఉంది అంతేకాకుండా ఆర్ అండ్ బి రోడ్డు 7 మీటర్లు ఆక్రమించుకొని నిర్మాణం చేస్తున్నారు ఈ భవనానికి మున్సిపల్ అధికారులు ఎలా అప్రూవల్ ఇచ్చారు సామాన్యులకు మాత్రం అప్రూవల్ కావాలంటే దొరకదు 100 కారణాలు చెబుతారు కనుక సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ సర్వే చేయించి ఆక్రమ గురైన స్థలాన్ని తొలగించి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా కోరారు

Scroll to Top