ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎయిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ – 55 మంది విద్యార్థులకు చెక్కుల పంపిణీ*
( పయనించే సూర్యుడు నవంబర్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఎయిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సంవత్సరానికి ఎంపికైన 55 మంది విద్యార్థులకు ఈ రోజు రూ.10 వేలకు గాను మొదటి విడతగా రూ.5 వేల చెక్కును అందజేశారు చెక్కులను అందజేశారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులను పంపిణీ చేయగా, మధ్యాహ్నం సమయంలో సైకాలజీ ట్రైనింగ్ సెషన్ ను నిపుణులచే నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలోక్ అగర్వాల్ – అధ్యక్షులు, చంద్రశేఖర్ గారు – డైరెక్టర్ ప్రగతి వెల్ఫేర్ సొసైటీ, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సీనియర్ కోఆర్డినేటర్ శంకర్ , సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీ కృష్ణ, ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జగదీశ్, రాజేష్ శ్రీనివాసన్ – వైస్ ప్రెసిడెంట్, CGI, కిరణ్ కుమార – డైరెక్టర్, CGI, నాగేశ్ గుప్తా – డైరెక్టర్, కన్సల్టింగ్ డెలివరీ, CGI, CSR కోఆర్డినేటర్ నందిత , ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కార్తిక్, శ్రీకాంత్, ప్రగతి, నవ్య, తులసి, లావణ్య,శ్రుతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రగతి వెల్ఫేర్ సొసైటీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగేందుకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.