PS Telugu News
Epaper

జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డా

📅 14 Nov 2025 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా ఘనంగా సంబరాలు “

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సారధ్యంలో దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంబరా నంటిన సంబరాలు దౌల్తాబాద్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం వద్ద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు దళితబాద్ మండలం కేంద్ర పరిధిలోని బాణాసంచా కాల్చి దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పడాల రాములు మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రేవంత్ అన్న కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన సంక్షేమ పథకాలు మరియు మా ప్రియతమైన నాయకుడు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి సారధ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ జూబ్లీహిల్స్ ప్రజలు యాదికి ఉంచుకున్నారు. కార్యకర్తల కష్టం వృధా కాలేదు. ఇదే ఊపు ఇదే జోష్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగాలని ఆశిస్తున్నాము నవిని యాదవ్ గెలుపుకు సహకరించిన జూబ్లీహిల్స్ ప్రజలకు మరియు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇందులో పాల్గొన్నవారు మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారి లాలు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి. సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు. భద్రయ్య. ఆది వేణు. రైతన్న. బండికృష్ణ .సామి .సత్యం తలారి నర్సింలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top