PS Telugu News
Epaper

కోల్‌కతా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మంటలు… నిమిషాల్లో భవనాలు భస్మం

📅 15 Nov 2025 ⏱️ 10:59 AM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కోల్‌కతాలోని ఎజ్రా స్ట్రీట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం 17 ఫైర్ ఇంజన్లనతో మంటలను ఆర్పుతున్నారు.కోల్‌కతా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బరాబజార్‌‌లో ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 17 ఎజ్రా స్ట్రీట్‌‌లోని ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటల ధాటికి భవనం మొత్తం కాలిపోయింది. షాపులోని లోపల భారీ పరిమాణంలో ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ ఉండటం వలన అవి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. మంటలు పక్కనే ఉన్న భవనానికి కూడా వ్యాపించాయి. ఈ ప్రాంతంలోని దుకాణాలన్నీ విద్యుత్ వస్తువులకు సంబంధించినవి కావడంతో మంటలను అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సిలిండర్లు కూడా పేలుతున్ట్లు తెలుస్తోంది. మంటలు భారీగా ఉండడంతో మొత్తం 17 ఇంజిన్లతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వస్తువులు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండగా.. ఆర్పడం కష్టంగా మారింది. మొదట మంటలు వ్యాపించిన భవనం వద్దకు చేరుకోవడం సిబ్బంది సవాల్‌గా మారింది. స్ట్రీట్‌కు రెండు వైపుల నుండి నీటిని చల్లుతూ, పక్కనే ఉన్న భవనాలకు మంటలు పెద్దగా వ్యాప్తి చెందకుండా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా.


Scroll to Top