PS Telugu News
Epaper

250 రూపాయల లోపు సొంతిల్లు! లక్కీ డ్రా విజేతపై పోలీసులు విచారణ మొదలు

📅 15 Nov 2025 ⏱️ 11:28 AM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చిన్నదో పెద్దదో ఓ ఇల్లు సొంతంగా కట్టుకోవాలని సాధారణ మధ్యతరగతి ప్రజలు భావిస్తారు. తమకు ఉన్న సంపాదనలో కొద్ది భాగం ఇల్లు కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇపుడున్న పరిస్థితుల్లో సొంతిల్లు సమకూర్చుకోవడం మధ్య తరగతి ప్రజలకు భారంగానే మారింది. పట్టణాల్లో అయితే పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మారింది. అయితే ఖమ్మం లో ఓ ఇల్లు ఓనర్ వినూత్న ఆఫర్ తో..ముందుకు వచ్చాడు. ఖమ్మం లో లక్కీ డ్రా పేరుతో ఇళ్ల అమ్మకాలు చేస్తున్నారు. ఖమ్మం జయ నగర్ కాలని లో 130 గజాల్లో రూ 25 లక్షలు విలువగల ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రూ 250 చెల్లించి లక్కీ డ్రా లో పాల్గొనాలనీ ఆఫర్.పెట్టారు… డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున డ్రా తీస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ను నమ్మి కొందరు డబ్బులు చెల్లించి డ్రా కూపన్ తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఖమ్మం అర్బన్ పీఎస్ లో నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.

Scroll to Top