PS Telugu News
Epaper

సూళ్లూరుపేట పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

📅 15 Nov 2025 ⏱️ 2:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు నవంబర్ 15న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ” పరిశుభ్రంగా ఉండండి” వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో చెట్లు నాటడం, డివైడర్లు మరియు కాలిబాట యందు పిచ్చి మొక్కలు శుబ్రం చేయించుట జరిగినది. పట్టణ వీధుల యందు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భాగముగా స్థానిక ప్రభుత్వ గర్ల్ హై – స్కూల్ జి.యన్.టి రోడ్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో, షార్ రోడ్డు సూళ్లూరుపేట నందు విద్యార్థులుచే వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత ప్రతిజ్ఞ చెప్పించారు పుర ప్రజలు కూడా కాలుష్య నియంత్రణ కోసం బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయరాదు అని మరియు చుట్టూ పక్క ప్రదేశాలలో కూడా శుబ్రంగా ఉంచుకోవాలని సూళ్లూరుపేట పురపాలక సంఘం కమిషనర్ కె.చిన్నయ తెలియజేశారు. అటులనే సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ప్రతి సచివాలయం యందు సెక్రటర్లచే మరియు మెప్మ ఆర్.పి లతో ” పరిశుభ్రంగా ఉండండి”ప్రతిజ్ఞ మరియు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, వార్డు ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది, నసచివాలయం సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు, మెప్మ సిబ్బంది మరియు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top