PS Telugu News
Epaper

గద్వాల జిల్లా లో ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించిన ఎమ్మెల్యే.

📅 15 Nov 2025 ⏱️ 3:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 16 నవంబర్ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించినఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
నాలుగు మంది రైతులు భూములు కోల్పోతే రైతులకు 15,14,667 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు చెక్కులను అందించిన ఎమ్మెల్యే.ఎమ్మెల్యే మాట్లాడుతూ లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కృష్ణమ్మ వరదలతో ముంపుకు గురైన రేకులపల్లి గ్రామం సమీపంలోని జెన్కో దగ్గర 67 ఎకరాల వరకు రైతులు తమ భూములను కోల్పోవడం జరిగింది దాదాపుగా 46 మంది రైతులు తమ భూములను త్యాగం చేసి జెన్కో లో విద్యుత్ ఉత్పత్తికి సహకరించినందుకే నేడు ప్రజలకు నాణ్య మైన కరెంటు సరఫరా కావడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు భూమిని ఎంతో పెద్ద మనసుతో ఆనాడు భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.కావున జెన్కో అధికారులతో పలుమార్లు కలిసి మాట్లాడి భూమిని కోల్పోయిన రైతులను ఆదుకోవాలని వారికి ఏదో రూపంలో ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందించాలని కోరడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతుకు ప్రతి ఎకరానికి ఏడు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఏడు లక్షల రూపాయలు కూడా తక్కువని ప్రస్తుత భూమి విలువ ధర 30, 40 లక్షల రూపాయలు విక్రమం అవుతుంది. మీ త్యాగం ఎన్నటికీ ఎప్పటికీ మరువలేనని కొనియాడారు.నేడు మూడో విడతలో భాగంలో రేకుల పల్లి గ్రామానికి చెందిన రైతులకు 4 మందికి అక్షరాల 15 లక్షల 14 వేల 667 రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది.మీ త్యాగం వల్లనే నేడు విద్యుత్, సాగునీటి సరఫరా అవుతుందని కావున గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలని రైతులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, , మాజీ కౌన్సిలర్ శ్రీను ముదిరాజ్, నాయకులు హనుమంతు రెడ్డి, గంట రమేష్ స్వామి, నాగేంద్ర యాదవ్, లక్ష్మన్న, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top