బిహార్‌లో ఎన్డీఏ బలంపై ఒక్క సర్వే ప్రాముఖ్యంగా మారింది
పయనించే సూర్యుడు న్యూస్ :బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు 202, మహాగఠ్‌బంధన్‌కు 34, ఇతరులకు 7 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాయి.కానీ, ఇంతటి మెజార్టీ వస్తుందని అంచనా వేయలేకపోయాయి. ఒక్క సంస్థ మాత్రం ఫైనల్ రిజల్ట్స్‌ను ముందుగానే చెప్పేసిందా? అన్నట్లు అంచనాలను కచ్చితత్వంతో వెల్లడించింది. అదే కామాఖ్యా అనలిటిక్స్. ఎన్డీఏకు 187 రావచ్చని అంచనా వేసింది. మిగతా సంస్థలతో పోల్చితే కామాఖ్యా అనలిటిక్స్ బెటర్.ఆ సంస్థ ఎన్డీఏకు167–187, మహాగఠ్‌బంధన్‌కు 54–74, జేఎస్పీ, జేఎస్యూపీకి 0–2, ఇతరులకు 2–7 సీట్లు వస్తాయని చెప్పింది. దీంతో ఇతర సంస్థలన్నింటి కన్నా బెటర్‌గా అంచనా వేసిన సంస్థగా నిలిచింది.