ఎర్రకోట చుట్టుపక్కల పరిస్థితులు కుదుటపడడంతో మార్కెట్లు ఓపెన్
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ ఎర్రకోట పరిసర ప్రాంతంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారు బాంబు జరిగిన నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఇవాళ మునుపటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యథావిధిగా నేతాజీ సుభాష్ మార్గ్, చాందిని చౌక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. అలాగే ఎర్రకోట ముందు ఎప్పటిలాగే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయితే పేలుడు ప్రాంతంలో మాత్రం స్వల్పంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నెల 10న సాయంత్రం రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో సడన్‌గా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.అయితే కారు బాంబు పేలుడు ఆత్మహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో డాక్టర్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసారు. ప్రమాదం తర్వాత ముఖ్యమైన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లోనూ నిఘా పెట్టారు.అలాగే ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన నిఘా వర్గాలు ఎయిర్ పోర్టుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత నిఘా పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించాక.. ఈ ఘటనకు ప్రధాన సూత్రదారిని గుర్తించారు. ఆమె ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ అని గుర్తించారు.