PS Telugu News
Epaper

రోజుకు 8 గంటల పని రూల్—దీపిక క్లారిటీ ఇచ్చింది

📅 15 Nov 2025 ⏱️ 4:38 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్‌లలో ఒకరు దీపికా పదుకొణె . ఆమె అందం, నటన, పనిపట్ల ఆమెకున్న డెడికేషన్ ఏదైన అత్యుత్తమంగా రాణించే నటి. ఇటీవల వర్క్ అవర్స్‌పై ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నప్పటికీ, రోజుకు 8 గంటలకు మించి షూటింగ్‌లో పాల్గొననని చెప్పడంతో.. సినీఇండస్ట్రీలో చర్చలు మొదలైంది. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది.. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో నటి దీపిక స్వయంగానే క్లారిటీ ఇచ్చింది. ఈ నిర్ణయంపై దీపిక మాట్లాడుతూ.. ‘ఇటీవల కాలంలో ఎక్కువ పని, తక్కువ నిద్ర సాధారణంగా మారింది. అయితే, మన శరీరం, మనసు రోజుకు 8 గంటల పని కంటే ఎక్కువను సపోర్ట్ చేయలేవు. 8 గంటల తర్వాత చేసే పనిలో క్వాలిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా.. నేను అమ్మను అయిన తర్వాత తల్లులను మరింత గౌరవించాను. అమ్మలకు ఇంట్లో బేబీ,  బయట పనిని రెండింటినీ బాలన్స్ చేయడం మాటల్లో చెప్పడం అంత సులువుకాదు. అందుకే కొత్తగా తల్లులయిన వారికి ఇండస్ట్రీలో సపోర్ట్ ఎంతో అవసరం’ అని తెలిపారు.

Scroll to Top