తాసిల్దార్ ఆఫిస్ కి వెళ్లాలంటే ప్రజల గుండెల్లో దడ పుడుతుంది
పయనించే సూర్యుడు నవంబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పట్టణ0 లో తాసిల్దార్ ఆఫీస్ ఆవరణలో ఉన్న పాత ట్రెజరీ & సబ్ జైల్ గా ఉన్న పురాతన భవనముల పరిస్థితి మరి ఘోరంగా తయారై ఏ నిమిషంలో అయినా కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నది ఇటువంటి అపాయకరమైన పురాతన భవనాన్ని కూల్చేందుకు ఎటువంటి చర్య ప్రభుత్వం తీసుకో లేదంటే ఆశ్చర్యంగా ఉంది అందులో స్వయంగా తాసిల్దార్ కు కళ్ళెదుర్నే కనబడుతున్నది ఎంతోమంది పట్టణ ప్రాంత వాసులు తాసిల్దార్ కార్యాలయం కి వచ్చినప్పుడు ఈ పరిసరాల్లోనే వారు సేద తీర్చుకుంటారు అర్జీలు వ్రాసుకునే వారు కూడా ఇక్కడే కూర్చొని వ్రాసుకుం టూ ఉంటారు అలాంట ప్పు డు ఇటువంటి పురాత న భవనము కుప్పకూలితే అది పెను ప్రమాదంగా మారి ఎంతోమంది ప్రాణా కలను బలి తీసుకునే అవకాశం ఉందని దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ పురాతన భవనాన్ని తొలగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినదిగా కోరుచున్నారు
