PS Telugu News
Epaper

తెరుచుకున్న శబరిమల ఆలయం41రోజుల పాటు మండల పూజప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తెరిచుకున్న శబరిమల ఆలయ తలుపులు

📅 17 Nov 2025 ⏱️ 1:47 PM 📝 HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మండల-మకరవిళక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయ తలుపులను తెరిచారు. ఈ క్రమంలో భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారుఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ గర్భగుడి నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్లు వద్ద అధి పవిత్ర మంటను వెలిగిస్తారు. సుమారు ఆరుగంటల ముప్పై నిముషాల కు ప్రధాన పూజారి ఆలయంలో అభిషేక కార్యక్రమం జరిగింది. ఆదివారమే ఆలయాన్ని తెరిచినప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ మొదలవుతుంది. ఆ రోజు నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తారు.41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి పది గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ డిసెంబర్ ముప్పై న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల ఇరవై న ఆలయాన్ని మూసివేస్తారు …

Scroll to Top