మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి “మాట్లాడుతున్న యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఆది రంగన్న
(పయనించే సూర్యుడు నవంబర్ 17 రాజేష్)
మధ్యాహ్నం భోజన నిర్వహణ కార్మికుల బిల్లులో వెంటనే చెల్లించాలని యూనియన్ రాష్ట్ర కోశాధికారి రంగన్న కోరారు. ఆదివారం దౌల్తాబాద్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మధ్యాహ్నం లో భోజనా కార్మికులకు 10 నెలలుగా వేతనాలు బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ రెండు గుడ్లు కూడా రావడం లేదన్నారు. 10 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉంటే కార్మికులు ఎంతకాలం పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలాసార్లు కలెక్టర్లను డీఈవో లకు వినిపించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనినే నిరసిస్తూ ఈనెల 24 తేదీన చలో ఎడ్యుకేషనల్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కార్మికుల కోరారు. ఇందులో పాల్గొన్నవారు యాదమ్మ. ప్రమీల. ఇందిరమ్మ. భారతమ్మ. ఉమారాణి. అనిత. భవాని తదితరులు పాల్గొన్నారు