పేరుకు సర్టిఫికెట్ బ్లాక్ బెల్ట్ ఉంటే సీనియర్ కాదు. నిత్యం శిక్షణలో ఉండే వారే సీనియర్ మాస్టర్లు
.కరాటే మాస్టర్లు ఎప్పటికప్పుడు నూతన శిక్షణలో ఉండాలి
(పయనించే సూర్యుడు నవంబర్ 17రాజేష్)-
యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్సిద్ధిపేట జిల్లాలో కలిగిన కరాటే మాస్టర్ల నియామక విషయంలో యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.దుబ్బాక మండల కేంద్రంలో కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తన పై శిక ఎల్లగౌడ్ అనే సీనియర్ కరాటే మాస్టర్ డి వై ఎస్ ఓ నియామకాలు సరిగానే జరిగాయాని చెప్పడం విడ్డురంగా ఉన్నదని గత పది సంవత్సరాలలో ఎక్కడ కూడా పి ఎమ్ శ్రీ స్కూల్లో చెప్పని నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలాంటి అనుభవం లేకుండా కరాటే క్లాసులు చెబుతా అనడం ఆశ్చర్యంగా ఉంది.గతంలో లచ్చపేట ఆదర్శ పాఠశాలలో హెచ్ బి టి గా టీచింగ్ చేసి సరిగా విధులు నిర్వహించలేదని తొలగించరాణి ఆరోపణలు ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా సీనియర్ కరాటే మాస్టర్ ను అంటూ ఈ రంగంలోకి వచ్చావ్? “పేరుకు సర్టిఫికెట్ బ్లాక్ బెల్ట్ ఉంటే సీనియర్ కాదు. నిత్యం శిక్షణలో ఉండే వారే సీనియర్ మాస్టర్లు.విద్యార్థులకు భద్రంగా ఉన్న మార్గదర్శకత్వం కావాలి. DYSO అధికారిని షరతులు పాటించకుండానే సర్టిఫికెట్ ఉన్న వారే వీరి నియామకానికి సంస్ధలు ప్రయత్నించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై దెబ్బపడే అవకాశం ఉంది” అని అన్నారు.ఈ సందర్బంగాకేవలం బెల్ట్ లేదా సర్టిఫికెట్ వల్లే సీనియర్ మాస్టరుగా గుర్తించకూడదు. రియల్ గానే విద్యార్థులకు క్రమశిక్షణ, నైపుణ్యం కల్పించడంలో క్రియాశీలంగా ఉండేవారే సీనియర్ మాస్టర్లు.గత పదేళ్లలో సమగ్ర శిక్షలో కరాటే క్లాసులు చేపట్టని కొందరు కూడా ఇప్పుడు తమను తాము సీనియర్ మాస్టర్స్ అంటూ ప్రెస్ మీట్లిస్తుండటం సరికాదని వివరించారు.DYSO అధికారిని అనుమతించగానే అవకాశం వస్తుందని భావించి, కేవలం సర్టిఫికెట్ ఆధారంగా నియామకం చేయడం వల్ల విద్యార్థులకి నష్టమని చెప్పారు.కరాటే మాస్టర్లు ఎప్పటికప్పుడు నూతన శిక్షణలో ఉండాలి; ఎప్పుడూ నిత్య విద్యార్థిగా అభివృద్ధి చెందాలి.ముఖ్యంగా, మాస్టర్లను ఎంపిక చేసే ముందు డెమో క్లాస్‌లు నిర్వహించి వారి నైపుణ్యాన్ని పరీక్షించాక నియామకం చేయాలని ఆయన స్పష్టం చేశారు.విద్యార్థుల భద్రత, భవిష్యత్తు కోసం అవాంఛనీయ నియామకాలను నివారించేందుకు విద్యా విభాగం, ఏజెన్సీలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.కరాటే మాస్టర్ల నిజమైన క్వాలిఫికేషన్ నిర్ధారించేందుకు డెమో క్లాస్‌లు నిర్వహించడమే మేలని అభిప్రాయపడుతున్నామని అన్నారు.రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పోర్ట్స్ హబ్ గా ముందుకు పోయేట్టుగా కృషి చేస్తామన్నారు.