PS Telugu News
Epaper

దేశ ఐక్యతకు ప్రతీక సర్ధార్ వల్లభాయ్ పటేల్.

📅 17 Nov 2025 ⏱️ 7:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగులు చక్రపాణి.

ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో *బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ * పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం NTR మినీ స్టేడియం లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్ధార్ దేశ ఐక్యతకు ప్రతీక అని కొనియాడారు. స్వాతంత్య్రం నాటికి విచ్చనంగా ఉన్న భారత దేశ సుమారు 560 పైగా సంస్థానాలను ఏకం చేసిన ఘనత సర్ధార్ పటేల్ గారిదన్నారు. గత పాలకులు ఎందరో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను బయటికి రాకుండా కప్పిపుచ్చారన్నారు. నిజాం రజాకర్ల అరాచక పాలన నుండి విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని అందించిన వల్లభాయ్ పటేల్ చరిత్రను నేటి సమాజం ఎప్పకి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు,జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, చిన్నారెడ్డి, విలాస్, RDO రత్నా కళ్యాణి, తో పాటు జిల్లా బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ , సుంకరి సాయి బీజేపీ పట్టణ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top