మహిళల సంక్షేమం,సాధికారతకు కాంగ్రెస్ కృషి..!
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.!
( పయనించే సూర్యుడు నవంబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.. సోమవారం మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో పెబ్బే గాయత్రి,జహారా బీ లకు సంబందించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ,,,రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా ఇండ్లను నిర్మించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాలేశ్వర్,మాజీ డిప్యూటీ సర్పంచ్ శివకుమార్,ఏర్పుల లింగం,వట్టెల లింగం,మల్లేష్,మల్లేష్ గౌడ్,తుమ్మల గోపాల్,గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప్ కుమార్,పాల్గొన్నారు…
