ఆర్థిక సహాయం అందజేత
పయనించే సూర్యుడు మైలార్దేవపల్లి , నవంబర్ 18:
అనారో గ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ కుటుంబాన్ని మణికొండ పాలమూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. మైలార్ దేవపల్లి డివిజన్ బాబుల్ రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్‌కు కాలుకు గాయం కావడంతో ఆయన కాలును డాక్టర్లు పూర్తిగా తొలగిం చారు. చికిత్స పొందుతున్న లక్ష్మణ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మైలార్ దేవపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్ ఆధ్వర్యంలో కుటుంబ పడుతున్న ఇబ్బందులను మణి కొండ పాలమూరు కురుమ సంఘం అధ్య క్షులు ఎస్.నర్సింహ దృష్టికి తీసుకెళ్లగా ఆయ నతో పాటు సంఘం కార్యదర్శులు, సభ్యు లంతా కలిసి రూ. 40 వేల సహాయం అంద జేశారు. ఈ కార్యక్రమంలో కె.రమేష్, జి.రాములు, ఉప్పల్ శ్రీను, తిమ్మప్ప, హరి కృష్ణ, నర్సింహ, అశోక్, శివరాజ్‌కుమార్, శేఖర్, ప్రవీణ్, సన్నీ, రఘువీర్, జి.మహేష్, కె.మారుతీ తదితరులు పాల్గొన్నారు.
