PS Telugu News
Epaper

రాణంపల్లిలో రూ. 50 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

📅 18 Nov 2025 ⏱️ 4:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, నవంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో రూ.50 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు మాట్లాడతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో
గత ప్రభుత్వ హయంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేకూరుస్తుందని వివరించారు. అదేవిధంగా మున్నూరు కాపు సంఘంలో వంటశాల లేదని కోరగా, వంటశాల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే సభా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, నేరుగంటి బాలరాజు, పట్టేపు రాములు, షేక్ ఖాదర్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top