PS Telugu News
Epaper

మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ కార్మికుల కు సరైన వసతులు కల్పించట్లేదు

📅 18 Nov 2025 ⏱️ 4:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 18 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ పనిచేస్తున్న కార్మికులకు సరైన వసతులు కల్పించడం లేదు ఎండొచ్చినా వానొచ్చినా పనికి మాత్రం రావాలి వానలో తడుస్తూ ఎండల్లో ఎడుతూ పనిచేయాలి వానొస్తే తల దాచుకోవటానికి వాన కోటు కూడా ఇవ్వరు ఎండ వచ్చిన అంతే సంగతి పని మాత్రం బాగా చేపించుకుంటారు కానీ కనీస వసతులు కల్పించరు ఒంట్లో బాగా లేక పోయిన పనికి రావాలి మా పెళ్ళాం పిల్లల కి బువ్వ పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నాం కానీ అధికారులు మేము ఏమైనా పర్వాలేదు మాకు మాత్రం పనిచేయాలి మున్సిపాలిటీ అధికారులు కార్మికుల పట్ల రాచరిక పాలన సాగిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి మా పైన దయుంచి మాకు కనీస వసతులు కల్పించండి లిస్టులో పేరు వస్తే గాని కనీస వసతులు కల్పించరా

Scroll to Top