చత్రపతి శివాజీ మహారాజ్ తల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి: యువ నాయకులు బాజీరావు*
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని బాసర మండల కేంద్రంలో ఒక వర్గానికి చెందిన దుండగుడు హిందువులు ఆరాధ్య దైవంగా భావించే చత్రపతి శివాజీ మహారాజ్ తల్లి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, దీనికి నిరసనగా హిందూ సంఘాలు, కుల సంఘాలు, గ్రామ యువకులు, పెద్దలు, నియోజకవర్గ యువ నాయకులు బాజీరావు , బిజెపి మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ , మాజీ అధ్యక్షులు కిషోర్ దేశాయ్ , ప్రతాప్ రావు , మాజీ జెడ్పిటిసి అధ్యక్షులు రాజేశ్వర్ , బిజెపి బాసర మాజీ టౌన్ అధ్యక్షులు సుభాష్ యాదవ్ ,రమేష్ , గంగాధర్ , మారుతి పటేల్ , శివాజీ , యోగేష్ మరియు యువకులు ప్రధాన రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఏఎస్పీతో మాట్లాడుతూ దుండగున్ని ఎట్టి పరిస్థితిలో వదులద్దని, కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది, ఏఎస్పి అవినాష్ గారి హామీ మేరకు నిరసన కార్యక్రమం ఆపడం జరిగింది.