కార్మికులను పీడిస్తున్న సమస్యలు.స్పందించాల్సిన బాధ్యత గెలిచిన సంఘాల పై ఉంది.GLBKS.IFTU ప్రధానకార్య దర్శి జే.సీతారామయ్య.
పయనించే సూర్యుడు నవంబర్ 18 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి
:సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయించడం లో సమస్యలను పరిష్కరించ డంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటియుసి,ఐఎన్ టియుసిలువిఫలంఅయ్యారనిసింగరేణి కొత్తబావులు లేవని ఉన్న గనులను అమ్మకానికి పెట్టారని ఇప్పుడు 42 వేల పర్మినెంట్,35 వేల కాంట్రాక్టు కార్మికుల జీవితాన్ని మంట కలుపుతూ లాభాలతోనడుస్తు న్న సింగరేణి మనుగడ ప్రమాదంగా మారిందని సింగరేణి తల్లిని బ్రతికించు కోవాలని ఇదే గెలిచిన సంఘాలకు సంఘాలకుప్రధానబాధ్యతని సింగరేణిపరిరక్షణఉద్యమంలో GLBKS..IFTU జనరల్ సెక్రెటరీ జే.సీతారామయ్య డిమాండ్ చేశారు మంగళవారం కోయగూడెంలో OC కార్మికులను కలిసి ఆయన మాట్లాడారు 2023 డిసెంబర్ ఎన్నికల సందర్భంగా ఏఐటియుసి,ఐఎన్ టియుసి ఇచ్చినహామీలనుగుర్తుచేశారుగుర్తింపు ,ప్రాతినిధ్య సంఘాల గా 2ఏండ్లు గడుస్తున్నా హామీలను ఎందుకు అమలు చేయలేకపోయాని ప్రశ్నించారు. అనేక అంశాలపై చైర్మెన్,పా వద్ద జరిగిన ఒప్పందాల అమలు కు సర్కులర్ ఇవ్వలేదని 12.9.25న గుర్తింపు సంఘం ఎఐటియుసి ప్రకటించిన విషయం గమనిస్తే గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని కట్టడిచేయలేకపోతుoదని తేట తెల్లం అవుతుందనిఅన్నారు.కొత్తబావులు,గనులఅమ్మకాలకువ్యతిరేకంగా,ఆదాయపన్నురద్దు,మెడికల్ బోర్డు,మారుపేర్ల సమస్య సొంతింటిపథకం ,కాంట్రాక్టుకార్మికులకుHPCవేతనాలు,ఆపరేటర్లకు ప్రమోషన్స్,14 డిమాండ్లపై చైర్మెన్,డైరెక్టర్ పా వద్ద ఒప్పందం జరిగింద ని వాటి అమలుకుసర్కులర్ ఇవ్వలేదని ఏఐటియుసి అంటున్నది నిజమే అయితే సమస్యల పరిష్కారానికి అన్ని యూనియన్ లను కలుపుకొని యాజమాన్యంపై ఒత్తిడి చేసేందుకు పూనుకో వడంలేదని ప్రశ్నించారు.20నగోదావరిఖనిలోసమావేశం.బొగ్గుబావులను అమ్మకాల కు పెడితే సింగరేణికి బతుకు లేదని వేలంపాటలో పది బావులు వస్తాయని మాట్లాడుతున్న చైర్మెన్ నైని బ్లాక్ (ఒడిస్సా)లో సింగరేణి ఉద్యోగులు ఎందరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న సింగరేణికికోయగూడెం..3,సత్తుపల్లి..3,తాడిచర్ల..2లాంటి బ్లాకు లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను ప్రతిఘటించకుంటే సింగరేణికి మరణశాసనo రాసినట్లేనని గుర్తించి సింగరేణి పరి రక్షణకు20నవిజ్ఞప్తి చేశారు గోదావరిఖనిలో జరిగే ఐక్య సమావేశంకుఏఐటీయూసీ,ఐఎన్టీయూసీలు తమ బాధ్యతగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారుఎండ్ న్యూస్