కొత్త వైరస్ ప్రభావం: ముగ్గురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన
పయనించే సూర్యుడు న్యూస్ :మరో వైరస్ దూసుకొస్తుంది. ఆఫ్రికా దేశంలో మార్బర్గ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇథియోపియాలోని దక్షిణ ప్రాంతంలో ముగ్గురు మరణించినట్లు ధృవీకరించింది. దీంతో పాటు ఈ ప్రాణాంతక రక్తస్రావ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఆరోగ్య అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకరమైన ఎబోలాగా పరిగణించే ఈ వైరస్ కారణంతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ సూడాన్‌కు సరిహద్దులోని ఓమో ప్రాంతంలో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ముగ్గురు మరణించినట్లు ఆరోగ్య మంత్రి మెక్‌డెస్ దాబా ప్రకటించారు. ఎబోలా తరహా వ్యాధితో ముగ్గురు మరణించినట్లు పరీక్షలు ధృవీకరించాయి. కాగా, ఈ వ్యాధి లక్షణాలతో మరణించిన మరో ముగ్గురిపై దర్యాప్తు జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ ప్రాంతమంతా ఎమెర్జెన్సీ ప్రకటించారు.అయితే ఈ వ్యాధిగ్రస్తులతో పరిచయం ఉన్న 129 మందిని మెడికల్ అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణ సూడాన్ సరిహద్దు జిల్లాలలోని నివాసితులను ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఈ వ్యాధికి గురైన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే ఈ కేసులలో రోగులకు ముక్కు, చిగుళ్లు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం అవుతుందని వైద్యులు తెలిపారు.