PS Telugu News
Epaper

‘ఆంధ్రాకింగ్ తాలూకా’ ట్రైలర్ విడుదల

📅 19 Nov 2025 ⏱️ 1:22 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ నవంరబ్ 27న రిలీజ్ అవుతుంది. ఋ క‌మ్రంలో మేక‌ర్స్‌ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.  భాగ్య‌శ్రీ బోర్సె క‌థ‌నాయిక‌గా న‌టించింది. ఉపేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాతో రామ్ హిట్ కొడ‌తాడా..లేదా! అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు.

సినిమా ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..- “ఏరా కళ్ళు నెత్తికెక్కినయా?… లేదురా, నెత్తి మీదే ఉన్నాయి. తలెత్తుకుని చూసే మనిషి ఉన్నప్పుడు కళ్ళు నెత్తిమీదే ఉంటాయి.”
– “నువ్వెంత నీ బతుకెంత… నా థియేటర్‌లో నాలుగు టికెట్ ముక్కలు సంపాదించుకోడానికి తప్ప బయట దేనికి పనికొస్తావ్ రా?”

ఇలాంటి ఎమోష‌న‌ల్ డైలాగ్స్ రామ్ స్టైల్‌కు బాగా సరిపోయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వ‌స్తుంది. అభిమాని ఆత్మ క‌థ అనే ట్యాగ్ లైన్ ఏదైతో ఉందే.. అది ప‌క్కాగా స‌రిపోయిన‌ట్లుందని ట్రైల‌ర్‌ను చూస్తుంటేనే తెలుస్తుంది. రామ్ అభిమానులు ఈసారి తప్పకుండా హిట్ ఖాయం అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎన్నాళ్లగానో రామ్ ఒక క్లాసిక్ టచ్ ఉన్న కథతో వస్తున్నాడని ట్రైలర్‌తో స్పష్టమవుతోంది.మూవీ రిలీజ్‌కు ముందే ఆల్బమ్‌కి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా రామ్ స్వయంగా రాసిన ‘నువ్వుంటే చాలే’ పాటపై ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం తర్వాత రామ్‌కు అదే స్థాయి సక్సెస్ అందలేదు. సీక్వెల్‌తో పాటు ‘రెడ్’, ‘స్కంద’, ‘ది వారియర్’ వరుసగా నిరాశపర్చడంతో ఈసారి రామ్ పకడ్బందీ కథని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పి. మహేశ్ బాబుతో కలిసి రూపొందించిన ‘ఆంధ్రాకింగ్ తాలూకా’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Scroll to Top