జల సంరక్షనే లక్ష్యాముగా భీమ్గల్ మండలంలో జలసిరి గ్రామ సభలు నిర్వహించబడినది.
పయనించే సూర్యుడుD.29.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఈరోజు బుధవారం రోజున భీమ్గల్ మండలంలో VBGRAM G(వికసిత్ భారత్ గ్యారంటీ రోజుగా మిషన్ గ్రామీణ్) పథకంలో జలసిరి కార్యక్రమాలపై 29 ,30 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడమైనది వారి ఆదేశానుసారం ఈరోజు బుధవారం రోజున మండలంలో 14 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడింది మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మెండోరా గ్రామాన్ని సందర్శించారు.ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 5 పంట కుంటలు, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి గ్రామంలో ఒక ఊట కుంట, ప్రభుత్వ కార్యాలయాలలో ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, చేపట్టాలని తెలిపినారు.మహిళా సమాఖ్య సంఘాల భాగస్వామ్యంతో ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపినారు.ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధb తీసుకోవాలని కోరినారు.ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు,ప్రత్యేక అధికారులు, గ్రామ సంఘాల సభ్యులు,VBGRAM G సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు..