PS Telugu News
Epaper

జీవించి ఉన్నప్పుడు భోజనం కూడా పెట్టలేకపోయానని ఆవేదన

📅 19 Nov 2025 ⏱️ 2:44 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్:మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కుమారుడు బతికున్నప్పుడు తిండి పెట్టలేకపోయానని, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నానని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి ఓ తండ్రి తన కుమారుడు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పని చేస్తున్న బాలరాజ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా పత్తి మిల్లులో పని చేస్తు పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడడంతో ఉపాధి కోల్పోయాడు. భర్త, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో కలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బాలరాజ్ స్థానికంగా హోటల్లో పని చేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్నాడు.ఈ క్రమంలో  పెద్ద కుమారుడు హరీష్(8) తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ తరుణంలో అనారోగ్యానికి చికిత్స చేయించేందుకు డబ్బులు లేక వైద్యం చేయించలేదు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి మృతి చెందాడు.  కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక, స్మశానంలో మృతదేహాన్ని పట్టుకుని 8 గంటలపాటు ఏడుస్తూ కూర్చున్నాడు. బతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అంటూ  తండ్రి బాలరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు.ఇదిలా ఉండగా, కొంతమంది స్థానికులు బాలరాజ్‌పై పలు విమర్శలు చేస్తున్నారు. పత్తి మిల్లులో పనిచేసే ఆయనకు తాగుడు అలవాటు ఉందని చెబుతున్నారు. తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్నారు.  తాగుడుకు బానిస కావడంతోనే ఆ కుటుంబ సభ్యుల జీవితం దారుణంగా తయారు కావడంతో ఈ బాధ భరించలేక అతని భార్య వెళ్లిపోయందన్నారు.  అలాగే ఆ బాబుకు తిండి పెట్టలేక రెండు నెలలు అయిందని అంటున్నారు. దీంతో ఆ బాబు భోజనం సరిగా లేక చనిపోయాడని, నిత్యం బాలరాజ్ తాగి పడుకుంటాడన్నారు. ఇక ఆ బాబును చూసుకునే వారు లేక చనిపోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Scroll to Top