PS Telugu News
Epaper

సమంత, రవితేజ కలిసి నటించనున్న తాజా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

📅 19 Nov 2025 ⏱️ 3:12 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన‍్‌గా వెలుగొందిన సమంత ప్రస్తుతం కెరీర్‌లో కొత్త మ‌లుపు తీసుకుంది. న‌టిగానే కాకుండా నిర్మాత‌గానూ మారింది. ‘ఏ మాయ చేశావే’చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి ఆకట్టుకున్న ఈ చెన్నై బ్యూటీ.. వరుస హిట్‌లతో దక్షిణాదిలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నాయికగా ఎదిగింది. నాగ చైతన్యతో పెళ్లి.. విడాకుల తర్వాత కూడా ఆమె కెరీర్‌పై ప్రభావంలేకుండా ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ ప్రేక్షకులకు ‘ది ఫ్యామిలీ మాన్ 2’ ద్వారా ద‌గ్గ‌రైన సమంత మయోసైటిస్ కారణంగా కొంతకాలం బ్రేక్ తీసుకుంది. తాజాగా ఆరోగ్యం మెరుగుపడడంతో మళ్లీ ఫుల్ ఫోకస్ కెరీర్‌పైనే పెట్టింది. ఈ క్రమంలో ఆమె ‘ట్రాలాల‌’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా బిజీ అవుతోంది. సమంత నిర్మాణంలో వచ్చిన ‘శుభం’ మంచి విజయాన్ని సాధించగా, తాజాగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని కూడా రూపొందిస్తోంది.  ఇప్పుడు మరో ఆసక్తికర వార్త సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత సమంత మళ్లీ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆమె చివరిగా విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో జోడీ కట్టే అవకాశముందని టాక్.సమంత రవితేజ సినిమాలో నటించడానికి కారణం దర్శకుడు శివ నిర్వాణ. ఈయ‌న ఇది వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల్లో మ‌జిలీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. అందులో స‌మంత హీరోయిన్‌. ఇప్పుడు ఆయ‌న రవితేజ హీరోగా డైరెక్ట్ చేయ‌బోతున్న థ్రిల్ల‌ర్‌ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు  సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే ఇది సమంతకు పక్కా కంబ్యాక్ హిట్‌గా మారే అవకాశముందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మ‌రెమ‌వుతుందో చూడాలి మ‌రి.


Scroll to Top