ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి:టీఎస్ యుటీఎఫ్
ఘనంగా టీఎస్ యుటిఎఫ్ 12వ మండల మహాసభలు
పయనించే సూర్యుడు నవంబర్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బకాయిపడిన ఐదు డిఏలను,పిఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు,బానోతు రాందాస్ లు డిమాండ్ చేశారు.ఏన్కూర్ స్థానిక మండల కేంద్రంలోని రైతు వేదిక (కూరపాటి పాండురంగయ్య ప్రాంగణంలో)మండల మహాసభలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2010 ఆగస్టు 23 ముందు నియామకం పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగంలో మార్పులు తీసుకురావాలన్నారు.ఈ – కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని కోరారు.అలాగే జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖలో పండిట్స్, పిఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ పదోన్నతులు కల్పించాలని,గిరిజన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టిలకు నెల నెల వేతనాలు చెల్లించాలని,సిఆర్టి ల, కేజీబీవీల సర్వీసును క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఏన్కూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బానోతు రామచంద్,ప్రధాన కార్యదర్శిగా మూడ్ పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా వి.శ్రీదేవి, జె.పుల్లయ్య, కోశాధికారిగా బి. నరసింహరావు ఎన్నికైనారు. కార్యక్రమంలో లక్ష్మి కుమారి,రాఘవరావు, శంకర్రావు, ఎం. నాగేశ్వరరావు, శ్యాం కుమార్, హతిరామ్, చంద్ర ప్రకాష్,విజేత, అనసూయ, , నిర్మల, బి.నాగేశ్వరరావు, భావ్ సింగ్, భాస్కర్ రావు, , రమేష్, సదానందం, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
