కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొత్తూరు మండలం సిద్ధపూర్ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్యానాయక్ తాత గోణ్య నాయక్ అనారోగ్య కారణంతో మరణించిన,మరియు కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబెర్ నరేందర్ తల్లి రాదబాయ్ ఇటీవల కాలంలో మరణించిన కారణంగా వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తు వారి అకాల మరణాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,భూపాల్ రెడ్డి,అజయ్ నాయక్,మరియు బీఆర్ఎస్ నాయకులు,గూని మహేష్, సిద్ధపూర్ నరేందర్,తదితరులు పరామర్శించారు.
