రైతులకు యూరియా పంపిణీ వ్యవసాయ అధికారి
పయనించే సూర్యుడు నవంబర్ 19( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల వ్యవసాయ అధికారి పి హిమబిందు. మేడం సూచనలతో చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామ సచివాలయం పరిధిలోని స్థానిక పెరుమాళ్ళపాడు ఆర్ ఎస్ కె పరిధిలో పొట్టి పల్లి గ్రామంలో బుధవారం యూరియా పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నాయకులు ఇస్మాయిల్ , కామేశ్వర్ బాబుచేతుల మీదుగా యూరియా పంపిణీ జరిగినది ఈ కార్యక్రమలో గ్రామ వ్యవసాయ సహాయకులు మమత, వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు