PS Telugu News
Epaper

అంగన్వాడి సమస్యలపై దిశ కమిటీ సమావేశంలో చర్చిస్తాం* * దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి

📅 20 Nov 2025 ⏱️ 3:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

(ప్రయాణించే సూర్యుడు నవంబర్ 20 రాజేష్ దౌల్తాబాద్)

దౌల్తాబాద్ మండల గ్రామం దొమ్మాట పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతున్న దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి పాఠశాలల అంగన్వాడి సమస్యలపై దిశా కమిటీ దృష్టికి తీసుకెళ్లి,కమిటీ సమావేశంలో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట అంగన్వాడి సెంటర్లను, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం నిధులను మొదటి ప్రాధాన్యత విద్యపై ఖర్చు చేసి విద్యాభివృద్ధికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. దొమ్మట ప్రాథమిక పాఠశాల కు గేటు లేకపోవడం వల్ల పాఠశాలలో మద్యం సేవించడం, చింతపండు,మిరపకాయలు మామిడి తరుగు, ఆరబెట్టడం జరుగుతుందన్నారు. తదితర అసంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునే పాఠశాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు. పాఠశాలకు గేటు నిర్మించే విధంగా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి అంగన్వాడి కేంద్రాలు కలరు వేయడానికి రూ. 2 వేలను అందజేశారు. అంగన్వాడికి కలరు కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రావు, బిజెపి కార్యకర్తలు శ్రీకాంత్ గౌడ్, కృష్ణ, సురేష్,భాస్కర్, స్వామి,ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు,తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top