PS Telugu News
Epaper

“బస్‌స్టాప్‌లో భర్త వెయిట్ చేస్తుండగా… భార్య సడెన్‌గా ప్రియుడి బైక్‌లో ఎంట్రీ!”

📅 21 Nov 2025 ⏱️ 2:30 PM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :భార్య చేసిన ఒక చిన్న తప్పు చివరకు ఆమె కుటుంబాన్నే చిన్నా బిన్నం చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తరువణ్ణామలైలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువణ్ణామలైలోని కోడికుప్పం ప్రాంతానికి చెందిన రాజా, సులోచన దంపతులు చెన్నైలోని పోరూర్ సమీపంలోని ముగలివాక్కం ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా భార్య సులోచనకు వేదనాయగం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా తన భార్యను మందలించాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగడం ప్రారంభమయ్యాయి.అయితే తాజాగా గురువారం సాయంత్రం రాజా తన స్వగ్రామానికి వెళ్లడానికి పోరూర్ టోల్ ప్లాజా బస్ స్టాప్ వద్ద తన భార్య కోసం వేచి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో, అతని భార్య సులోచన తన ప్రేమికుడు వేదనాయగంతో కలిసి బైక్‌పై అక్కడికి వచ్చింది. అది చూసిన రాజా ఒక్కసారిగా ఊగిపోయాడు. కోపం తట్టుకోలేక.. నిర్మాణ పనుల కోసం ఉపయోగించేందుకు పెట్టుకున్న తన బ్యాగ్ ఉన్న సుత్తిని తీసి భార్య తలపై కొట్టాడు. దీంతో భార్య సులోచన తలపగిలి తీవ్రంగా గాయపడింది.అయితే సులోచనపై దాడి చేయడంతో రెచ్చిపోయిన ఆమె ప్రియుడు వేదనాయగం, అతని స్నేహితులు రాజాపై విచక్షణారహితంగా దాడి చేశారు, ఇందులో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అందరినీ చెదరగొట్టి గాయపడిన భార్యాభర్తలిద్దరినీ చికిత్స కోసం కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ సులోచన ప్రాణాలు కోల్పోయింది. భర్త రాజా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Scroll to Top