కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఓకే చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇచ్చారు.అందుకే గవర్నర్ అనుమతి..కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడుతూ..‘2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్’ను అమెండ్ చేశారు. ఏ మంత్రి మీద విచారణ చేయలన్నా.. విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణ తర్వాత ఛార్జ్‌షీట్ వెయ్యాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నాం. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించాం. 3 నెలలు అవుతున్నా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ అనుమతి లేకుండా కేటీఆర్‌ను అరెస్ట్ చేసినా.. కేసు పెట్టినా పది నిమిషాలల్లో ఆయనకు బెయిల్ దొరుకుతుంది. కేసు నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది’ అని అన్నారు..