PS Telugu News
Epaper

“మరింత స్క్రీన్ టైమ్ తో అవతార్ 3 మూవీ రివీల్”

📅 21 Nov 2025 ⏱️ 3:21 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్: ప్రపంచ సినిమా అభిమానులను ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో చూడాల‌నుకుని వెయిట్ చేస్తోన్న ఫ్రాంచైజీల్లో అవతార్ 3 ఒక‌టి.  మూడో భాగంపై రోజు రోజుకీ ఆస‌క్తి పెరుగుతోంది. జేమ్స్ కామెరూన్ ప్రతీసారి అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే దర్శకుడు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అవతార్ 3 కోసం వెయిట్ చేస్తున్నార‌న‌టంలో సందేహం లేదు. 2009లో వచ్చిన మొదటి అవతార్ క‌థ భూమి, ప్రకృతి ఆధారంగా సాగితే, 2022లో విడుదలైన రెండో భాగం ‘వే ఆఫ్ వాటర్’ కథ సముద్ర జీవనాన్ని అద్భుతంగా చూపించింది. ఇక మూడో సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అగ్నిపై ఉంటుంది. క్రిస్మస్ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నారు. ఈ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సినిమాల విష‌యంలో పోటీ పెద్ద‌గా క‌నిపించ‌టం లేదు.తాజా స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వచ్చిన అవ‌తార్ రెండు భాగాల ర‌న్ టైమ్ చూస్తే.. కామెరూన్ ప్రతి సారి కొంచెం పెంచుతున్నట్లు సినిమా ప్రేమికులు గమనిస్తున్నారు. తొలి భాగం 162 నిమిషాలు, రెండో భాగం 192 నిమిషాల నిడివితో వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, అవతార్ 3 సుమారు 195 నిమిషాల (మూడు గంటల 15 నిమిషాలు) ర‌న్ టైమ్‌తో రానుందని వినికిడి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బాక్సాఫీస్ విషయానికి వస్తే, అవతార్ 1 ప్రపంచవ్యాప్తంగా $2.923 బిలియన్ (దాదాపు ₹21,500 కోట్లు), అవతార్ 2 $2.9 బిలియన్ (దాదాపు ₹18,630 కోట్లు) వసూలు చేయడం రికార్డు. ఇక అవతార్ 3 ఏ మేర కలెక్షన్లు సాధిస్తుంది? అనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మ‌రి అవ‌తార్ 3 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Scroll to Top