భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ ముఠా అరెస్టు
పయనించే సూర్యుడు నవంబర్ 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
భద్రాచలంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్ఐ సతీష్ నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయగా, 65 కిలోల కల్తీ నెయ్యి డబ్బాలు లభించాయి. దీని విలువ రూ.52 వేలు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.