మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వేదికగా ఆగస్ట్ 1 తారీఖన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశo
డాక్టర్ మణికంఠ గౌడ్ మహబూబ్ జిల్లా నాయకులు మక్తల్ నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్
పయనించే సూర్యుడు జులై 31మక్తల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల పార్లమెంట్ కో ఆర్డినేటర్ మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగస్ట్ 1 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ఎ ఎస్ ఎన్ గార్డెన్ లో జరగబోయే మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజక వర్గాల జనసైనికుల విస్తృత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర నాయకులు రావడం జరుగుతుంది.కావున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్ లు జనసైనికులు మెగా అభిమానులు జనసేనపార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్. ఆశయాలు తెలంగాణ లో ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యల పైన పోరాడేందుకు సిద్ధం అవుతున్న తరుణం లో ప్రతి జనసైనికుడు ఈ సమావేశంలో పాల్గొనాలని మరియు భవిషత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఈ వేదిక ద్వారా జనసైనికులకు ఇంచార్జ్ లకు దిశా నిర్దేశం చేయనున్నారు కావున పర్తి ఒక్కరూ హాజరు కావాలని మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యుల డాక్టర్ మణికంఠ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.