PS Telugu News
Epaper

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విట్టల్ రెడ్డి

📅 21 Nov 2025 ⏱️ 5:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి

ఈరోజు కుంటల మండలంలోని కుంటాల మండల కేంద్రం మరియు ఓలా గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగింది . కుంటాల గ్రామానికి చెందిన నాంపల్లి రమేష్ 25 వేల రూపాయలు అలాగే ఓలా గ్రామానికి చెందిన బొమ్మెన గంగుబాయి 36,500 సీఎం సహాయనిధి చెక్కును అందజేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ సీఎం సహాయనిధి చెక్కులు పేద ప్రజలకు ఎంతో అండగా ఉంటున్నాయని అన్నారు చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు * ముధోల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విట్టల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వెంకటేష్, హైమద్ పాషా మరియు మండల సీనియర్ నాయకులు గజేందర్,రాకేష్, భోగ లక్ష్మణ్, సంతోష్ మరియు తదితరు లు ఉన్నారు.

Scroll to Top