నిర్మల్ జిల్లా పాలనాధికారి కి శుభాకాంక్షలు తెలియజేసిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
జలసంచాయ్- జనభాగీదారీ అవార్డును
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ఇటీవలి న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించినందున, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో *ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డిఆర్డిఓ విజయలక్ష్మిని ఎమ్మెల్యే సన్మానించి, అభినందించారు.
