PS Telugu News
Epaper

ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం.

📅 21 Nov 2025 ⏱️ 6:34 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

శుక్రవారం ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నయ్య,నంద్యాల పట్టణ టీవీ టెక్నీషియన్స్ సంఘం అధ్యక్షులు జయపాల్, కార్యదర్శి వెంకట శివ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, నంద్యా జిల్లా టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని ముందుగా టెలివిజన్ రూపకర్త బైర్డ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రభుత్వాసుపత్రి లో ఉన్న రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎం.డి.ఫిరోజ్ రోగులను పరామర్శించి అందుతున్న చికిత్సల గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎం.డి.ఫిరోజ్ మాట్లాడుతూ టీవీ టెక్నీషియన్స్ కు మెప్మా ఆధ్వర్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించడం జరుగుతున్నదని, అర్హులైన వారికి ఇండ్లు,ఇళ్ల స్థలాలు కేటాయించడానికి సహకరిస్తామన్నారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ టెలివిజన్ సాంకేతికత నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందని తదనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని టీవీ టెక్నీషియన్స్ మెరుగుపరుచుకోవాలని, వినియోగదారుడికి నాణ్యమైన,నమ్మకమైన సేవలు అందించడం ద్వారా వృత్తిలో మంచి ఫలితాలు అందుతాయన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి సహకరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టీవీ టెక్నీషియన్స్ రాష్ట్ర సంఘం కోశాధికారి రామకృష్ణ, నంద్యాల పట్టణ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పుల్లయ్య, గౌరవ సలహాదారు గోకారి, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, సంయుక్త కార్యదర్శి ఎల్లా గౌడ్, కోశాధికారి వీరారెడ్డి, సహకోశాధికారి కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top