స్వచ్ఛ రథంపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు, టి.డి.పి. నాయకులు.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
తాడిపత్రి శాసనసభ్యులు జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి, యాడికి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎం.పీ.డీ.వో. వీర రాజు, గ్రామపంచాయతీ డిప్యూటీ ఎం.పీ.డీ.వో. శశికళ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛరథం అను కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా యాడికి మండలంలోని, రాయల చెరువు, చందన, కోన, ఉప్పలపాడు, వేములపాడు, గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు, టి.డి.పి. యాడికి మండల బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, మరియు సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొని ఈ స్వచ్ఛ రథం తీసుకొని ప్రధాన రహదారులలో ప్రజలకు అవగాహన కల్పించారు. డిప్యూటీ ఎం.పీ.డీ.వో.శశికళ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు తమ ఇంట్లో ఉన్న పొడి చెత్తను (ప్లాస్టిక్, ఐరన్, అట్ట పెట్టెలు వంటివి) స్వచ్ఛ రథం వాహనాలకు అందించాలి. దానికి బదులుగా స్వచ్ఛరథం వాహనాలు ఆ చెత్తకు సమానమైన విలువ కలిగిన నిత్యవసర సరుకులను ఉచితంగా అందిస్తాయి అని అధికారులు. తెలిపారు. టి.డి.పి. బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ మాట్లాడుతూ సేకరించిన చెత్తను సమానమైన విలువ కలిగిన నిత్యవసర సరుకులను ఆ ఇంటికి తిరిగి అందిస్తారని స్వచ్ఛరథం యొక్క లక్ష్యం ప్లాస్టిక్ రహిత గ్రామాలను సృష్టించడం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని టి.డి.పి.బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ తెలిపారు.

