PS Telugu News
Epaper

ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ల అనుమతులను  రద్దు చేయాలని నవంబర్-25 న చలో కలెక్టరెట్

📅 22 Nov 2025 ⏱️ 1:31 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {నవంబర్ 22మక్తల్ }

మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (TUCI) గ్రామ జనరల్ బాడీ సమావేశం బాట రాజు అధ్యక్షత న కమిటీ హాల్ నందు సమావేశం జరిగింది.

కార్యక్రమానికి మఖ్య వక్తగా వచ్చినటువంటి టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబరు కొడ్స్ వళ్ళ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు, సహజ మరణాలకు రూ.2 లక్షలకు పెంచి, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ఈ నాలుగు సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్యూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.12ను 2025  జులై 22న విడుదల చేసింది. జీఓ విడుదల చేసిన 2 రోజులకే (ప్రైవేట్ బీమా కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీకి రూ.250 కోట్లు, ఎర్గో జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీకి రూ.95 కోట్లు, ట్రెయిల్ బ్లెజర్ అనే బ్రోకర్ సంస్థ ద్వారా మొత్తం రూ. 340 కోట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వ అధికారులు అక్రమంగా బదిలీ చేశారు. కేంద్ర చట్టం, రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా నిధులు దారి మళ్ళించడాన్ని భవన నిర్మాణ కార్మిక  సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం.సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతో ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు దూర్ర్వినియోగం చేసింది. కార్మికులకు అవసరం లేకున్నా హెల్త్ టెస్ట్లు చేయించుకోకపోతే లేబర్ కార్డులు తొలగిస్తామని కార్మికులను బెరిరిస్తూ టెస్టులు చేస్తున్నారు. 33 జిల్లాల్లో 17. కేంద్రాలను ఎంపిక చేసుకొని 7 మంది ల్యాబ్ మేనేజర్లను పెట్టి ఈ టెస్ట్లు చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్నది. టెస్ట్లు ఒక్కో కేంద్రంలో రోజుకు 100 నుండి 150 వరకు టెస్ట్లు చేస్తున్నారు. ఒక కార్మికునికి టెస్ట్ చేస్తే రూ.3,250/-లు సిఎస్సి సంస్థకు బోర్డు నుండి చెల్లిస్తున్నారు. రోజువారీగా 7 సెంటర్లలో సుమారు 1,000 మందికి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కరోజు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,000 మంది కార్మికులకు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన ఎంప్లాయికి సిఎస్సి సంస్థ వారు రూ.90/-ల చొప్పున ఇస్తున్నారు. ఒక నెలకు 30,000 మందికి, సంవత్సరానికి 3,60,000 మందికి టెస్ట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వెల్ఫేర్ బోర్డు నుండి సుమారు రూ.500 కోట్లు టెస్ట్ల పేరుతో దుబారా చేశారు. ఈ టెస్ట్ల వల్ల కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఏ ప్రభుత్వ హాస్పిటల్లోనైనా హెల్త్ టెస్ట్లు చేస్తారు. వీరు టెస్ట్లు మాత్రమే చేసి డాక్టర్ని సంప్రదించండి అని చెప్తారు. కావల్సిన మందులు వాటికయ్యే ఖర్చులు కార్మికులే భరించాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లు కూడా సక్రమంగా రావడం లేదు. ఉన్న జబ్బులు లేనట్లుగా, లేని జబ్బులు ఉన్నట్లుగా చూపుతున్నారు. సిఎస్సి నుండి ఒక వ్యక్తి యూరిన్ & బ్లెడ్ తీసుకొని వెళ్ళి అన్ని టెస్టులు చేస్తున్నారు. అనవసరమైన టెస్టులు చేస్తు వేయిల కోట్ల రూపాయలు దారిమాలించడాన్ని కండించారు.పై సమస్యల పరిస్కారం కోసం నవంబర్ 25 తారీకున జిల్లా కలెక్టర్ ఆఫిస్ ముందు ధర్నా, మండల కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశం పట్టణ కేంద్రంలో అడ్డాల పై ప్రచారం చేయాలనీ నిర్ణయించారు అనంతరం తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర కార్మిక సంఘం రి న :- H-74 గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా:- మేకలి నరసింహులు అధ్యక్షులుగా:- బాట ఎర్రప్ప
ఉపాధ్యక్షులు:- గుంటనోల రాము ప్రధాన కార్యదర్శి:- గుడిసె తిమ్మప్ప సహాయ కార్యదర్శి:- పేట రాజు
కోశాధికారిగా:- బాటరాజు సభ్యులుగా కర్ణ కృష్ణయ్య, బుడబోయే సత్తెప్ప బాట, భీమప్ప లను ఎన్నుకున్నారు ఈకార్యక్రమంలో గుడిసె కృష్ణయ్య బేగరి రాము ముష్టిపల్లి తిమ్మప్ప బొక్కి బాలప్ప భీమ్సేన్ కున్సి, మల్లెపల్లి భీమప్ప దుప్పలి రామప్ప తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top