కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలకు పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన శ్రీపాద రాజేందర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈరోజు శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.అదే మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అబ్దుల్ ఖాదర్ ఇటీవల ఆటో ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈరోజు ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
