PS Telugu News
Epaper

ఎమర్జెన్సీ వార్డులో ఇదేం చెండాలమైన పని రా డాక్టరు.. చీ ..చీ.. కాబోయే భార్యతో హాస్పిటల్ లోనే.. (వీడియో చూడండి)

📅 23 Nov 2025 ⏱️ 9:16 AM 📝 వైరల్ న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు.. తన కాబోయే భార్యతో చేసిన పని, అతని కొంపముంచింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదికాస్త అధికారులకు చేరింది. దీంతో సదరు డాక్టర్‌ను అత్యవసర విధుల నుండి తొలగించారు. ఈ వీడియోపై ప్రజల ఆగ్రహం వ్యక్తం కావడంతో, ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతని వసతి గృహాన్ని కూడా ఖాళీ చేయించారు. సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులకు వివరణాత్మక నివేదికను సమర్పించాలని సర్కార్ అదేశించింది. ఇటీవల రెండేళ్ల కాంట్రాక్టుపై నియమితులైన డాక్టర్ వకార్ సిద్దిఖీ, ఆసుపత్రి అత్యవసర వార్డులో విధులు నిర్వహిస్తన్నారు. ఆసుపత్రి పై అంతస్తులోని ఒక మూసివేసిన గదిలో తన కాబోయే భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో స్పష్టంగా కనిపించాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. వైద్యాధికారి వీరేంద్ర సింగ్ వెంటనే గమనించి డాక్టర్ సిద్ధిఖీ నుండి వివరణ కోరారు. వైద్యుడు సంతృప్తికరమైన ప్రతిస్పందన ఇవ్వకపోవడంతో, మరుసటి రోజు కఠిన చర్యలు తీసుకున్నారు. డాక్టర్ సిద్ధిఖీని అత్యవసర విధుల నుండి తొలగించారు, ఆయనకు కేటాయించిన గదిని ఖాళీ చేశారు మరియు తదుపరి చర్య కోసం సంఘటనపై వివరణాత్మక నివేదికను సీనియర్ ఆరోగ్య అధికారులకు పంపారు. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, వైద్య అధికారి వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, “ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఏ ప్రభుత్వ సౌకర్యంలోనూ సహించకూడదు. తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని తదుపరి శాఖాపరమైన సమీక్ష కోసం తీసుకువెళ్లాము.” అని అన్నారు. ఈ సంఘటన ఆసుపత్రి సిబ్బంది, స్థానికుల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ప్రభుత్వ వైద్య సంస్థలలో క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన గురించి ఆందోళనలను రేకెత్తించింది.

కింద లింకుపై క్లిక్ చేసి వీడియో చూడండి

https://twitter.com/NewsJanam/status/1992438128964149304?t=m1h-XQbGEMQFHZgNO-oFmg&s=19

Scroll to Top