ఇందిరమ్మ కాలనీలో మహిళా శక్తి చీరల పంపిణీ
పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గడ్డం మధుకర్ (చోటు) ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు శక్తి స్వరూపులని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ స్వయం సహాయక సంఘాల ద్వారా సంఘటితమవుతూ, ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం 15–18 ఏళ్ల కిశోర బాలికలకు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు కూడా సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. సంఘాల మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అందుబాటులోకి తెచ్చి, రూ. 2 లక్షల వరకు రుణ బీమా, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా మంజూరు చేసినట్టు వెల్లడించారు.కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొంపల్లి శ్యామ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గడ్డం రచన, ఏళ్ల సుజాత, కూచన రేఖ, తుమ్మ పద్మ, వివో సామల లాస్య, మహిళా సంఘం అధ్యక్షురాళ్లు, మహిళా పొదుపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.పొదుపు సంఘాల మహిళలు ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.